బ్రేకింగ్ : బండ్ల గణేష్ అరెస్ట్
నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ని హైదరాబాద్ లో బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ‘టెంపర్’ సినిమాకు సంబంధించిన వ్యవహారంలో నిర్మాతలు పివిపి, బండ్ల గణేష్ ల మధ్య వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు గానూ బండ్ల గణేశ్ కు పీవీపీ రూ.30 కోట్లు ఫైనాన్స్ చేసినట్టు, తీసుకున్న డబ్బులో రూ.7 కోట్లు తిరిగి చెల్లించనట్టు ఆరోపణలున్నాయి.
మిగిలిన డబ్బులు చెల్లించాలంటూ బండ్లను పీవీపీ కోరగా, ఇరువురి మధ్య విభేదాలు తలెత్తాయి. ఇటీవల బండ్ల అనుచరులు కొంతమంది తన ఇంటికి వచ్చి బెదిరింపులకు పాల్పడ్డారని పీవీపీ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో బండ్ల గణేష్ తో పాటు అతని అనుచరులపై ఐపీసీ సెక్షన్ 448, 506 కేసులు నమోదు చేశారు. ఆ తర్వాత కొద్దిరోజులు బండ్ల అజ్ఝాతంలోకి వెళ్లిపోయారు. ఇప్పుడు అతడిని ఈ కేసు విచారణ నిమిత్తం పిలిచిన పోలీసులు స్టేట్ మెంట్ రికార్డు చేశారు. ప్రస్తుతం బండ్ల గణేష్ బంజారాహిల్స్ ఏసీపీ కార్యాలయానికి తరలించినట్టు తెలుస్తోంది. మరీ.. బండ్ల బెయిల్ పై బయటికి వస్తారా ? అన్నది చూడాలి.