ధోనీ రిటైర్మెంట్ పై గంగూలీ కామెంట్
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ చాన్నాళ్ల నుంచి హాట్ టాపిక్ గా కొనసాగుతోంది. ఇక ధోని ఆటకు గుడ్ బై చెబుతారా ? ఇంకొన్నాళ్లు ఆడతాడా ?? అనే చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో కొత్త బీసీసీఐ పగ్గాలు చేపట్టిన సౌరవ్ గంగూలీ ధోని రిటైర్మెంట్ పైస్పందించారు. రెండు ప్రపంచ కప్‌లను అందించిన ధోనికి తన హయాంలో సముచిత గౌరవం లభిస్తుందని స్పష్టం చేశారు.
‘విజేతలు అంత త్వరగా ముగించరని మీకందరికీ తెలుసు. ధోనీ తన కెరీర్ గురించి ఏం ఆలోచిస్తున్నాడో, అతడి మదిలో ఏముందో నాకు తెలీదు. దాని గురించి మేం మాట్లాడతాం. అతనో గొప్ప ఆటగాడు. క్రికెట్లో ఎంఎస్ చాలాకాలం కొనసాగినందుకు భారత్ గర్విస్తోంది. అతడు సాధించిందేంటో మీరు ఒకసారి కూర్చొని ఆలోచిస్తే వావ్ ఎంఎస్ ధోనీ అంటారు. వీడ్కోలు ఎప్పుడు పలకాలన్నది అతడిపై ఆధారపడి ఉంటుంది. దిగ్గజాలకు ఎప్పుడూ ఘనమైన వీడ్కోలు దక్కుతుంది. నేనిక్కడ ఉన్నంత వరకు ప్రతి ఒక్కరికీ గౌరవం దక్కుతుంది. అందులో ఎలాంటి మార్పు లేదు’ అన్నారు గంగూలీ.