‘మత్తు వదలరా’ ఫస్ట్ లుక్ వదిలిన ఎన్టీఆర్ ! 


‘మత్తు వదలరా’ మైత్రీ మూవీస్ రాబోతున్న కొత్త చిత్రం. నటీనటులు, సాంకేతిక నిపులు అంతా కొత్తవారే. సింహ కోడూరి హీరోగా పరిచయం అవుతున్నారు. ఇతడు ‘యమదొంగ’ సినిమాలో ఎన్టీఆర్ చిన్నప్పటి పాత్రలో నటించారు. ఈ చిత్రానికి రితేష్ రానా దర్శకత్వం వహిస్తున్నారు. కీరవాణి తనయుడు కాల భైరవ సంగీతం అందిస్తున్నారు.  చిరంజీవి (చెర్రీ), హేమలత నిర్మిస్తున్నారు.
 
తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ని యంగ్ టైగర్ ఎన్టీఆర్ రిలీజ్ చేశారు. ‘మత్తు వదలరా’ ఫస్ట్ లుక్ ని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘తన బ్రదర్స్ అందరూ పెద్దవారైపోయారు. కాలం ఎంత వేగంగా పెరిగెడుతుంది. సింహా కోడూరి, భైరి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘మత్తు వదలరా’ చిత్ర యూనిట్ కి బెస్ట్ విషెస్’ అని తారత్ ట్విట్ చేశారు. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్ ని ఆసక్తిగా డిజైన్ చేశారు.