నవాజ్ షరీఫ్’పై విష ప్రయోగం ?

పాక్ మాజీ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ తీవ్ర అనారోగ్యానికి గురైనట్టు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు షరీఫ్ అనారోగ్యంపై సంచలన ఆరోపణలు బయటికొచ్చాయ్. విషప్రయోగం చేయడం వల్లే ఆయన ఆరోగ్యం దెబ్బతిందని షరీఫ్ తనయుడు హుస్సేన్ ఆరోపించారు. దీనిపై ఇమ్రాన్ ప్రభుత్వం సమాధానం చెప్పి తీరాలని డిమాండ్ చేశారు.

వివిధ కేసుల్లో దోషిగా తేలడంతో నవాజ్ జైలు శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. “మా నాన్నపై విషప్రయోగం చేశారు. అందుకే ఆయన ప్లేట్ లెట్ల సంఖ్య 16,000కు పడిపోయింది. ప్రమాదకర స్థితిలో ఉన్నారని వైద్యులు చెప్పారు. అనారోగ్యానికి గురైతే సరైన సమయంలో ఆయన్ని ఆసుపత్రికి తరలించలేదు. ఇందుకు ఇమ్రాన్ ప్రభుత్వం కచ్చితంగా సమాధానం చెప్పి తీరాలి” అని హుస్సేన్ డిమాండ్ చేశారు. ప్రస్తుతం షరీఫ్ ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు వైద్యులు తెలిపారు.