ప్రత్యర్థికి పదవిచ్చిన కేసీఆర్

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని అంటుంటారు. అది అక్షరాల నిజం. 2014, 2018 ఎన్నికల్లో గజ్వెల్ అసెంబ్లీ స్థానం నుంచి కేసీఆర్ పై పోటీ చేశారు వంటేరు ప్రతాప్ రెడ్డి. రెండు సార్లు కేసీఆర్ కి గట్టిపోటీ ఇచ్చారు. కేసీఆర్ ప్రత్యర్థిగా పాపులర్ అయ్యారు. 2018 ఎన్నికల ప్రచార సభకి వచ్చిన కాంగ్రెస్ చైర్ పర్సన్ సోనియా గాంధీ, అధ్యక్షుడు రాహుల్ గాంధీ ముందువంటేరు గట్టిగా మాట్లాడారు. గజ్వేల్ సీఎం కేసీఆర్ ని ఓడించి సోనియాగాంధీకి కానుక ఇస్తానన్నారు. కానీ, ఆయనకి మళ్లీ ఓటమి తప్పలేదు. 

2018లో ఓటమి తర్వాత వంటేరు కారెక్కిన సంగతి తెలిసిందే. తెరాస తీర్థం పుచ్చుకొన్న తర్వాత ఇన్నాళ్లు సలైంట్ గా ఉన్నారు. తాజాగా ఆయన సీఎం కేసీఆర్ కీలక పదవి అప్పగించారు. తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా నియమిస్తూ కెసిఆర్ ఉత్తర్వులు జారీచేశారు. దీంతో సీఎం కేసీఆర్ ఆయన ప్రత్యర్థికి పదవిచ్చారని తెరాస నేతలే గుసగుసలాడుకొంటున్నారు.