మహారాష్ట్ర, హర్యానాలోనూ భాజాపా హవా

మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. రెండు రాష్ట్రాల్లోనూ భాజాపా హవా స్పష్టంగా కనిపిస్తోంది.   మహారాష్ట్రలో మొత్తం 288 స్థానాలకుగాను ప్రస్తుతం 265 స్థానాల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఇప్పటి వరకూ బిజెపి కూటమి 142 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్‌ కూటమి 87 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, ఇతరులు 30 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.

ఇక హర్యానాలోని 90 సీట్లకుగాను బిజెపి 41 సీట్లలో ఆధిక్యంలో ఉంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్‌ 22 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇతరులు 20 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. మొత్తానికి రెండు రాష్ట్రాల్లోనూ భాజాపా కూటమి అధికారంలోకి రాబోతున్నట్టు ప్రస్తుత ఓట్ల లెక్కింపు ట్రెండ్ ని చూస్తే అర్థమవుతోంది.