హుజూర్ నగర్ లో దూసుకెళ్తున్న కారు

హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభం అయింది. కారు జోరు చూపిస్తోంది. నాలుగు రౌండ్లు పూర్తయ్యేసరికి తెరాస అభ్యర్థి సైది రెడ్డి 10,704 ఆధిక్యంలో ఉన్నారు. రౌండ్  రౌండ్ కు సైది రెడ్డి ఆధిక్యం పెరుగుతూ వస్తోంది. మూడో  రౌండ్ పూర్తయ్యే సరికి సైదిరెడ్డికి 6,787 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. నాల్గో రౌండ్ పూర్తయ్యేసరికి ఆ ఆధిక్యం 10,704కు చేరుకొంది. మొత్తం 20 రౌండ్ల లెక్కింపు జరగనుంది. మధ్యాహ్నం వరకు హుజూర్ నగర ఫలితం తేలనుంది.

గత యేడాది చివర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్ నగర్ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి లోక్ సభకు ఎన్నికై నేపథ్యంలో.. ఈ స్థానానికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యం అయింది. హుజూర్ నగర్ ఉప ఎన్నికలో గెలుపుపొందాలని కాంగ్రెస్, తెరాస, బీజేపీ హోరా హోరాగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాయ్. అదే సమయంలో ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఆ ప్రభావం హుజూర్ నగర్ ఉప ఎన్నికపై పడుతుందనే రాజకీయ విశ్లేషకులు భావించారు. ఐతే, ప్రస్తుత ఫలితాల ట్రెండ్ చేస్తుంటే ఆర్టీసీ స్ట్రయిక్ ఎఫెక్ట్ హుజూర్ నగర్ ఉప ఎన్నికపై ఏ మాత్రం పడినట్టు అనిపించడం లేదు. ఆర్టీసీ సమ్మె విషయంలో సీఎం కేసీఆర్ వైఖరిని ప్రజలు సమర్తించినట్టేనని హుజూర్ నగర్ ఫలితంతో భావించాల్సి ఉంటుందని అంటున్నారు.