‘భారతీయుడు 2’ కమల్ లుక్ లీకు ! 


శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న  ‘భారతీయుడు 2’ సినిమా నుంచి కమల్‌ హాసన్‌ ఫొటోలు లీక్‌ అయ్యాయి. కమల్‌-శంకర్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘భారతీయుడు’ చిత్రానికి సీక్వెల్‌ ఇది. కాజల్‌ కథానాయిక. రకుల్‌ప్రీత్‌ సింగ్‌, సిద్ధార్థ్‌, ప్రియాభవానీ కీలకపాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్‌ నటుడు అనిల్‌ కపూర్‌ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ భోపాల్‌ లో జరుగుతోంది. అక్కడ రూ.40 కోట్ల బడ్జెట్‌తో భోపాల్‌లో ఓ ఫైట్‌ సీన్‌ను తెరకెక్కించనున్నట్లు ఇటీవల ఫైట్‌ మాస్టర్‌ పీటర్‌ హెయిన్స్‌ తెలిపారు. ఈ ఫైట్‌ సీన్‌లో 2000 వేల మంది జూనియర్‌ ఆర్టిస్టులు పాల్గొంటున్నారు. తాజాగా భోపాల్‌ షూటింగ్‌లో పాల్గొన్న కమల్‌హాసన్‌.. ‘సేనాపతి’ పాత్రలో ఉన్న కొన్ని ఫొటోలు లీకయ్యాయి. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. భారతీయుడు సినిమాలోని కమల్ లుక్ ని పోలీవుంది.. ఈ లుక్.