కేసీఆర్ హవా ముందు ఎవరూ నిలవలేరు


తెలంగాణలో కేసీఆర్ హవా ముందు ఎవరు నిలవలేరని మరోసారి రుజువైంది. గత యేడాది ఆఖరులో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఏకంగా 88 స్థానాలని గెలుచుకొంది. తమ తమ స్థానంలో నిల్చొన్న అభ్యర్థి కంటే కేసీఆర్ పై నమ్మకంతోనే గంపగుత్తుగా గులాభి పార్టీకి ఓట్లేశారు తెలంగాణ ప్రజలు. ఒక్కమాటలో చెప్పాలంటే.. తెలంగాణలో అన్నీ నియోజకవర్గాల్లోనూ తెరాస అభ్యర్థిగా కేసీఆర్ గా భావించి ఓట్లేసి గెలిపించుకొన్నారు. 

ఇప్పుడు హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లోనూ తెరాస అభ్యర్థి సైదిరెడ్డి విజయం దిశగా దూసుకెళ్తున్నారు. తొలి ఆరు రౌండ్లు ముగిసేవరకు సైదిరెడ్డి 12వేల పై చిలుకు మెజారిటీలో ఉన్నారు. దీంతో ఆయన గెలుపు లాంఛనమేనని అర్థమవుతోంది. సైదిరెడ్డికి దాదాపు 25వేల మెజారిటీగా రావొచ్చని చెబుతున్నారు. హుజూర్ నగర్ లో తెరాస విజయం ఖాయమని తేలడంతో తెరాస శ్రేణులు ఆనందంలో ఉన్నారు. ఇక తెరాస అభ్యర్థి సైదిరెడ్ది మాట్లాడుతూ.. కేసీఆర్ హవా ముందు ఎవరూ నిలవలేరన్నారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడ చేసిన అభివృద్ధి ఏమీ లేదని విమర్శించారు. మొత్తానికి.. హుజూర్ నగర్ గెలుపుతో ఉత్తమ్ ఇలాకలో గులాభి జెండా ఎగరబోతుంది.