టాలీవుడ్ లో డ్రింకింగ్ కౌచ్ ఉద్యమం ?
ఇండస్ట్రీని ‘కాస్టింగ్ కౌచ్’ షేక్ చేసింది. కాస్టింగ్ కౌచ్ మాదిరిగానే ఇండస్ట్రీలో డ్రింకింగ్ కౌచ్ ఉద్యమం వచ్చేది. కానీ, రాలేదు. ఇంతకీ డ్రింకింగ్ కౌచ్ అంటే ఏంటీ ? అంటే.. ఇండస్ట్రీలోని కొందరు అవకాశాల పేరిట తమని వాడుకొని వదిలేశారని శ్రీరెడ్డి లాంటోళ్లు రోడేక్కిన సంగతి తెలిసిందే. ఇలాంటి బాపతే.. మగాళ్ల విషయంలోనూ జరుగుతుంటుంది. అదే డ్రింకింగ్ కౌచ్. ఈ తరహా ఉద్యమాన్ని మొదలు పెడదామని అనుకొన్నా.. కానీ, అవసరం రాలేదని తనదైన శైలిలో చెప్పుకొచ్చారు బిత్తిరి సత్తి.
ఒకప్పుడు వార్తలు చెప్పుకునే స్థాయి నుండి ఎదిగి, ఇప్పుడు తానే ఒక వార్త గా నిలిచినటు వంటివాడు బిత్తిరి సత్తి అలియాన్ చేవెళ్ల రవి. ఆయన హీరోగా నటించిన సినిమా ‘తుపాకి రాముడు’. టి. ప్రభాకర్ దర్శకత్వం వహించారు. ఈరోజే తుపాకి రాముడు ప్రేక్షకుల ముందుకొచ్చాడు. మంచి టాక్ ని సొంతం చేసుకొన్నాడు. ఐతే, ఈ సినిమా ప్రమోషన్స్ లో తన కెరీర్ స్టార్టింగ్ లో పడిన కష్టాలని సత్తి పంచుకొన్నారు. తాను సినిమాల్లో అవకాశాల కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఎవరు కూడా తనని పట్టించుకోలేదన్నారు.
చాలా మంది ఇష్టం వచ్చినట్లు తిట్టేవారని, కనీసం ఇక్కడ తినడానికి కూడా అవకాశం లేకపోయిందని బాధపడుతూ చెప్పారు. అలాగే ఇంకో రెండేళ్లు అవకాశాలు రాకపోతే.. తాను కూడా మీడియా ఎదురుగ నా జీవితం అంతా నాశనం అయింది. అందరు నన్ను బాగా వాడుకొని వదిలేసారు అంటూ ఏడవల్సి వచ్చేది. కాస్టింగ్ కౌచ్ మాదిరే తను ‘డ్రింకింగ్ కౌచ్’ అని కొత్త ఉద్యమాన్ని చేపట్టేవాడినని చెప్పుకొచ్చాడు. అలాగని బిత్తిరి సత్తి శ్రీరెడ్డిపై సటైర్స్ వేశారని కాదు. కానీ, నెటిజన్స్ సత్తి శ్రీరెడ్డినే గెలికాడని కామెంట్స్ చేస్తున్నారు. మరీ.. బిత్తిరి సత్తిపై వ్యాఖ్యలపై శ్రీరెడ్డి రియాక్ట్ అవుతుందేమో చూడాలి.