రామ్ ముందు చరణ్ తేలిపోయాడు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్టార్ హీరో. ఆయనతో ఎనర్జిటిక్ హీరో రామ్ ని పోల్చి చూడలేం. కాకపోతే.. సిట్యూవేషనల్ అలాంటిది. వినయ విధేయ రామ, ఇస్మార్ట్ శంకర్.. రెండూ మాస్ సినిమాలే. కానీ రిజల్ట్ లో మాత్రం ఎంతో తేడా. ఒకటి డిజాస్టర్ అయితే, ఇంకోటి  బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. రెండు ఒకేసారి రిలీజ్ అవ్వలేదు. కాబట్టి పోలిక పెట్టలేం. కానీ రెండు సినిమాలు ఒకే టైమ్ లో టీవీల్లో ప్రసారమయ్యాయి కాబట్టి పోలిక తప్పడం లేదు. ఈ రెండు చిత్రాల్లో ఇస్మార్ట్ శంకర్ దే పైచేయిగా నిలిచింది.

ఇస్మార్ట్ శంకర్ సినిమాకు ఏకంగా 14.44 టీఆర్పీ వచ్చింది. ఇక హైదరాబాద్ సెగ్మెంట్ లో ఈ సినిమా 20.71 టీఆర్పీతో సరికొత్త రికార్డు సృష్టించింది. ఫ్యామిలీ చిత్రాల్ని ఎక్కువగా ఇష్టపడే బుల్లితెర వీక్షకులు మాస్ మసాల చిత్రం ఇస్మార్ట్ శంకర్ ని ఎగబడి చూడటం విశేషం. ఇక ఇస్మార్ట్ కు పోటీగా అదే టైమ్ లో ప్రసారమైన ‘వినయవిధేయ రామ’ సినిమాకు అత్యల్పంగా 7.85 టీఆర్పీ మాత్రమే వచ్చింది. ఈ నేపథ్యంలో రామ్ ముందు చరణ్ తేలిపోయాడని సరదాగా చెప్పుకొంటున్నారు.