వైఎస్ భారతిని కలిసిన నమ్రత


సూపర్ స్టార్ మహేష్ బాబు రాజకీయాలకి దూరం. ఆయన సొంత భావ, ఎంపీ గల్లా జయదేవ్ కోసం కూడా ఆయనెప్పుడు ఎన్నికల ప్రచారానికి దిగలేదు. కాకపోతే.. బావ విజయాన్ని ఆకాక్షిస్తూ, ఆల్ ది బెస్ట్ చెబుతూ, గెలిచిన తర్వాత కంగ్రాట్స్ చెబుతూ ట్విట్ చేసి ఉండొచ్చు. ఇక శ్రీమంతుడు సినిమా తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తున్నారు. 

ఆ పనులని మహేష్ సతీమణి నమ్రత చూస్తుంటారు. ఈ నేపథ్యంలో శుక్రవారం నమ్రత సీఎం జగన్ సతీమణి భారతితో భేటీ కావడం ప్రధాన్యతని సంతరించుకొంది. విజయవాడ వెళ్లిన నమ్రత కనకదుర్గమ్మ దర్శనం చేసుకొన్నారు. ఆ తర్వాత తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లి భారతితో సమావేశం అయ్యారు. వీరిద్దరు పలు సామాజిక కార్యక్రమాలపై చర్చించారు.ఏపీలోని పలు గ్రామాలను దత్తత తీసుకునేందుకు నమ్రత ఆసక్తిగా చూపినట్టు తెలుస్తోంది. ఇప్పటికే మహేష్ బాబు గుంటూరు జిల్లా బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ది చేస్తున్నారు. బుర్రిపాలెం మహేష్ తండ్రి సీనీయ సూపర్ స్టార్ కృష్ణ సొంతూరు. ఈ గ్రామానికి సంబంధించిన అభివృద్ధి పనుల విషయంపైనే నమ్రత భారతిని కలిసినట్టు తెలుస్తోంది.