పవన్ పొలిటికల్ జోకర్.. వర్మ ఫిలీంగ్ ఇదేనా ?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇజ్ఝత్ తీసే పని చేశాడు వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ తర్వాత వర్మ మరోసారి ఏపీ రాజకీయాలని టచ్ చేస్తూ తీస్తున్న చిత్రం ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’. ఇందులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పాత్ర ఉంటుందని చెప్పి మెగా అభిమానులకి ఖుషి చేశాడు వర్మ. అచ్చం పవన్ లుక్ తోనే ఉన్న పిక్ ఒకటి వదిలి సంతోషపెట్టాడు.
 
ఇంతలోనే తన పైత్యం చూపించాడు. తాజాగా ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’ నుంచి పవన్ పాత్రకి సంబంధించిన మరో లుక్ ని వదిలాడు వర్మ. ఇందులో పవన్ ఎన్నికల ప్రచారం చేస్తున్నట్టుగా కనిపిస్తున్నాడు. ఆయన చుట్టూ ఇంగ్లీష్ భామలు రొమాంటిక్ మూడులో ఉన్నారు. దీనర్థం.. ఏపీ రాజకీయాల్లో పవన్ జోకర్ అని వర్మ భావిస్తున్నట్టు కనిపిస్తోంది. దీనిపై పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ నెల 27న ఉదయం 9:36 నిమిషాలకు కమ్మరాజ్యంలో కడపరెడ్లు ట్రైలర్ ని వదలనున్నాడు వర్మ. మరీ.. ట్రైలర్ లోనూ పవన్ ని బదనాం చేస్తాడా? లేదా హుందాగా చూపిస్తాడా? అన్నది చూడాలి. మొత్తానికి..తన సినిమా ప్రమోషన్స్ కోసం పవన్ బాగానే వాడుకొంటున్నట్టు కనిపిస్తోంది.