అశ్వత్థామరెడ్డిపై కేసుపెట్టిన ఆర్టీసీ డ్రైవర్

ఆర్టీసీ కార్మికుల సమ్మె ఏకపక్షంగా జరుగుతుందా ? సమ్మెకు కార్మికుల మద్దతు లేదా ?? అనే అనుమానాలు కలుగుతున్నాయ్. తాజాగా ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డిపై కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. కూకట్ పల్లి డిపో డ్రైవర్  కోరేటి రాజు అనే డ్రైవర్ అశ్వత్థామరెడ్డి పై కేసు పెట్టారు.ఆర్టీసీ కార్మికుల మరణాలకు అశ్వత్థామరెడ్డే కారణమని రాజు తన ఫిర్యాదులో పేర్కొ్న్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం పేరుతో కార్మికుల్లో ఆయన విషం నింపుతున్నారని ఆరోపించారు.

డ్రైవర్ చేసిన ఫిర్యాదు మేరకు అశ్వత్థామరెడ్డిపై ఐపీసీ 341, 506 సహా సెక్షన్ 7 కింద కేసులు నమోదు చేశారు. విలీన డిమాండ్ కార్మికులది కాదని.. అది అశ్వత్థామరెడ్డి వ్యక్తిగత కోరికని డైవర్ రాజు పేర్కొన్నారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆర్టీసీ సమ్మె విషయంలో ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లో తగ్గేలా లేదని అనిపించడంతో కొందరు ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారమ్.