‘తుపాకి రాముడు’ టాక్ ఏంటీ ?


టాలీవుడ్ లో దీపావళీ హవా కనిపించడం లేదు. ఏ ఒక్క స్టార్ హీరో దీపావళీకి వచ్చేందుకు ఇష్టపడలేదు. ఆ లోటుని తీరుస్తూ బిత్తిరి సత్తి ‘తుపాకి రాముడు’గా ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఐతే, తుపాకి రాముడికి పరభాష సినిమాలకి విపరీతమైన పోటీ ఎదురైంది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ‘విజిల్’ సినిమా ఈరోజే విడుదలైంది. తెలుగు రాష్ట్రాల్లో విజిల్ కి దాదాపు 700 థియేటర్స్ దక్కడం విశేషం.

మరో కోలీవుడ్ హీరో కార్తీ ‘ఖైదీ’కి తెలుగు రాష్ట్రాల్లో బాగానే థియేటర్స్ దక్కాయి. ఈ రెండు సినిమాల ప్రీమియర్ టాక్, పబ్లిక్ టాక్, ప్రివ్యూలు అంటూ హడావుడి కనిపిసుంది. కానీ, మన తెలుగు సినిమా. తెలంగాణ సినిమా ‘తుపాకి రాముడు’కి పబ్లిసిటీ కరువైంది. ఈ నేపథ్యంలోనే తుపాకి రాముడు అప్ డేట్స్ ని అందించేందుకు మీ టీఎస్ మిర్చి ముందుకొచ్చింది. ‘తుపాకి రాముడు’ మొదటి ఆట పడిపోయింది. థియేటర్స్ లో బిత్తిరి సత్తి తనదైన మార్క్ తో నవ్వులు పూయిస్తున్నాడు. 

ఒక్క కామెడీయే కాదు.. కథ-కథనాలు గ్రిప్పింగా సాగాయ్. నవ్వించడమే కాదు. బిత్తిరి సత్తి ఏడిపించాడు కూడా. ‘బతుకమ్మ’ లాంటి సినిమాతో ఆకట్టుకొన్న దర్శకుడు టి. ప్రభాకర్ సినిమాని అద్భుతంగా తెరకెక్కించాడు. తెలంగాణ, సంస్కృతి సాంప్రదాయాలని తెరపై ఆవిష్కరించాడు. రసమయి బాలకృష్ణ స్పెషల్ సాంగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మొత్తానికి.. తుపాకి రాముడుపై పాజిటివ్ టాక్ నడుస్తోంది. యాంకర్, నటుడుగానూ సక్సెస్ అయిన.. బిత్తిరి సత్తి తొలి ప్రయత్నంలోనే హీరోగా హిట్ అయ్యాడని చెప్పవచ్చు.