రివ్యూ : తుపాకి రాముడు
చిత్రం : తుపాకి రాముడు (2019)
నటీనటులు : బిత్తిరి సత్తి, ప్రియ, రసమయి బాలకిషన్ తదితరులు
సంగీతం : టి. ప్రభాకర్
నిర్మాత : రసమయి బాలకిషన్
రిలీజ్ డేట్ : అక్టోబర్ 25, 2019.
రేటింగ్ : 2.75/5
బిత్తిరి సత్తి – పరిచయం అక్కర్లేని పేర్లు. తనికి మాత్రమే సాధమైన హావా భావాలతో తీన్మార్ వార్తలతో ఫేమస్ అయ్యాడు. నటనపై వైపు అడుగులు వేశాడు. చిన్ని చిన్ని పాత్రలతో ఆకట్టుకొన్నాడు. ఇప్పుడు ఏకంగా హీరోగా మారి చేసిన సినిమా ‘తుపాకి రాముడు’. బతుకమ్మ ఫేం టి. ప్రభాకర్ దర్శకత్వం వహించారు. ఉద్యమనేత, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నిర్మించారు. దీపావళీ కానుకగా తుపాకి రాముడు ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చాడు. మరీ.. వెండితెరపై బిత్తిరి సత్తి ఏ మేరకు ఆకట్టుకొన్నాడు.. తెలుసుకొనేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ.. !
కథ :
తుపాకి రాముడు (బిత్తిరి సత్తి) తన వృత్తిని కొనసాగిస్తూ జీవనం సాగిస్తూ ఉంటాడు. అంతా సాఫీగా సాగుతున్న సమయంలో అతడి జీవితంలోకి ఒక అమ్మాయి వస్తుంది. ఆమె ఎంట్రీతో అతడి జీవితం మొత్తం అతలాకుతలం అవుతుంది. ఇంతకు ఆ అమ్మాయి ఎవరు? ఆమె వల్ల తుపాకి రాముడు పడ్డ కష్టం ఏంటీ అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. సింపుల్ గా స్టోరీ లైన్ ఇదే అయినా.. నవ్వులు పంచే తుపాకి రాముడు వెనక ఉన్న కష్టాలని తెరపై ఆవిష్కరించాడు దర్శకుడు.
ప్లస్ పాయింట్ :
* బిత్తిరి సత్తి
* కథ
* తెలంగాణ యాస, భాష
మైనస్ పాయింట్స్ :
* కథనం గ్రిప్పింగా సాగలేదు
* అక్కడక్కడ స్లో నేరేషన్
ఎలా ఉందంటే ?
తుపాకి రాముడు కథే పక్కా తెలంగాణ వాసనతో కూడినది. దానికి తగ్గట్టుగానే తెలంగణ ప్రాంతాల్లో చాలా సహజంగా తెరకెక్కించారు దర్శకుడు. తెలంగాణ పల్లె పదాలని చాలా బాగా వాడాడు. అవి ఆకట్టుకొనేలా ఉన్నాయి. బిత్తిరి సత్తి నుంచి మంచి నటని రాబట్టుకొన్నాడు. ఐతే, కథనం విషయంలో ఇంకాస్త శ్రద్ద తీసుకొంటే.. తుపాకి రాముడు రేంజ్ మరోలా ఉండేదని చెప్పవచ్చు. ఇప్పటికీ తుపాకి రాముడు ఎంటర్ టైనర్ గానే ఉన్నాడు.
ఎవరేలా చేశారంటే ?
తుపాకి రాముడు కోసం బిత్తిరి సత్తి పెద్దగా కష్టపడాల్సిన అవసరం రాలేదు. తనకు సహజసిద్ధమైన మేనరిజంకి చాలా దగ్గరి పాత్ర ఇది. అందులో బిత్రిరోడు ఒదిగిపోయాడు. తనదైన శైలిలో వినోదాన్ని పంచాడు. అంతేకాదు.. డ్యాన్సులు, ఫైట్లు చేశాడు. ఎమోషనల్ గా ఆకట్టుకొన్నాడు. మొత్తంగా.. బిత్తిరి సత్తి షో సూపర్ హిట్. కాకపోతే.. కథ-కథనంపై ఇంకాస్త ఫోకస్ పెట్టి వుంటే బాగుండు అనిపించింది. హీరోయిన్ ప్రియ నటనతో ఆకట్టుకొంది. రసమయి బాలకిషన్ పాత్ర, ఆయన ఆటా, పాట ఆకట్టుకొన్నాయి. మిగిలిన నటీనటులు తమ తమ పరిధి మేరకు నటించారు.
సాంకేతికంగా :
సినిమాలో పాటలు బాగున్నాయ్. థియేటర్స్ లో ప్రేక్షకులు లేచి నిలబడే రేంజ్ లో లేవు. గతంలో జై భోలో తెలంగాణ సినిమాలో గద్దర్ పాట వచ్చినప్పుడు ఎవరు కూడా సీట్లలో కూర్చోలేదు. అంతలా ఆకట్టుకొంది.. ఆ పాట. తుపాకీ రాముడులోనూ అలాంటి పాట ఒకటి ఉంటే బాగుండు అనిపించింది. నేపథ్య సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. తెలంగాణ పల్లెలని బాగా చూపించారు. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు బాగున్నాయి.
రేటింగ్ : 2.75/5
నోట్ : ఈ సమీక్ష సమీక్షకుడు వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.