రివ్యూ : విజిల్ 

చిత్రం : విజిల్ (2019)

నటీనటులు : విజయ్, నయనతార, వివేక్ తదితరులు

సంగీతం : ఎఆర్ రెహమాన్

దర్శకత్వం : అట్లీ కుమార్

నిర్మాత : కలపతి ఎస్ గణేష్

రిలీజ్ డేటు : 25 అక్టోబర్, 2019.

రేటింగ్ : 3/5

కొన్ని కాంబినేషన్స్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అలాంటి కలయికే అట్లీ-విజయ్. వీరి కాంబోలో వచ్చిన తెరి, మెర్సెల్ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. తెలుగులో డబ్ అయి ఇక్కడ బాగా ఆడాయి. దీంతో.. అట్లీ-విజయ్ కాంబోలో సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు ఆతృతగా ఎదుచు చూశారని చెప్పవచ్చు. వీరి కాంబోలో తెరకెక్కిన హ్యాట్రిక్ చిత్రం ‘బిగిల్’. తెలుగులో ‘విజిల్’గా తీసుకొన్నారు. దీపావళీ కానుకగా ‘విజిల్’ ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరీ.. తెలుగు ప్రేక్షకులని విజయ్ విజిల్ ఏ మేరకు ఆకట్టుకొంది ? తెలుసుకొనేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ.. !

కథ :

రాజప్ప (విజయ్) ఓ రౌడీ. ఆయన కొడుకు మైఖేల్ అలియాస్ బిగిల్ (విజయ్) ఫుట్‌బాల్ ఆటగాడు. జాతీయ జట్టుకు ఆడాలనేది బిగిల్ లక్ష్యం. అలాంటి మైఖేల్ కొన్ని కారణాల వల్ల తండ్రి రాజప్ప వారసత్వాన్ని పుచ్చుకొని రౌడీగా మారుతాడు. దానికి దారి తీసిన పరిస్థితులు ఏంటీ ? రౌడీయిజం కార్యకలాపాల్లో మునిగి తేలుతున్న మైఖేల్ మళ్లీ ఫుట్‌బాల్ కోచ్‌గా మారతాడు. కోచ్‌గా తనకు ఎదురైన ప్రతికూల పరిస్థితులను ఎలా అధిగమించాడు. బిగిల్ జీవిత ప్రయాణంలో నయనతార పాత్ర ఏమిటి ? అన్నది తెరపై చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

* విజయ్ నటన

* కథ-కథనం

* నేపథ్య సంగీతం

* సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్ :

* ఫస్టాఫ్ రొటీన్ గా సాగింది

* పాటలు

* రన్ టైం

ఎలా ఉందంటే ?

సినిమాని చాలా ఆసక్తిగా మొదలెట్టాడు దర్శకుడు. కాలేజీని కబ్జా చేసిన రాజకీయ నాయకుడిని ఎదురించే విద్యార్థుల అంశంతో కథ ఆసక్తిగా మొదలవుతుంది. రెగ్యుల్ మాస్ అంశాలతో విజయ్ ఎంట్రీ అదిరిపోయింది. విద్యార్థి సమస్యలపై పోరుతో ఫస్టాఫ్ రొటీన్ గా అనిపించినా.. ఇంటర్వెల్ ముందు మైఖేల్ ఫ్యాష్ బ్యాక్ ఓపెన్ కావడం విజిల్ కథ ఒక్కసారిగా లేస్తుంది. ఇక సెకాంఢాప్ లో కథని ఎమోషనల్ గా నడిపాడు.

ఫుట్‌బాల్ క్రీడాకారిణి యాసిడ్ దాడికి గురికావడం, అలాగే మరో క్రీడాకారిణిని ఆటకు దూరమైన కావడం అనే అంశాలు హృదయాన్ని టచ్ చేసేలా ఉంటాయి. జాకీ ష్రాఫ్ వేసే ఎత్తులకు బిగిల్ పైఎత్తులు వేస్తూ కథానాయకుడు తన లక్ష్యాన్ని చేరుకొన్నారు అన్నది ఆసక్తిగా చూపించారు. మాస్, ఎమోషన్, యాక్షన్ ని హైలైట్ గా చూపించారు. మహిళా నేపథ్యంలో సాగే కథని ఓ స్టార్ హీరోని పెట్టి కమర్షియల్ గా తెరకెక్కించడంలో అట్లీ విజయవంతం అయ్యారు.

ఎవరెలా చేశారంటే ?

ఓ స్పోర్ట్స్ డ్రామాకు సామాజిక అంశాలను జోడించి ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు దర్శకుడు అట్లీ. విజయ్ నటనకి వంకపెట్టలేం. రాజప్ప మాస్ ని మురిపించేలా ఉంది. ఇక ఫుట్ బాల్ ఆటగాడిగా, కోచ్ గా మైకల్ పాత్రలో విజయ్ అదరగొట్టాడు. మొత్తంగా.. మాస్, ఎమోషన్స్, యాక్షన్స్ అదిరింది. రౌడీగా, ప్రేమికుడిగా తన స్టయిల్ తడాఖా చూపించాడు. తొలిభాగంలో రాజప్పగా, ద్వితీయార్థంలో బిగిల్‌గా అదరగొట్టాడు. నయనతార పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదు. సాదాసీదా పాత్రలో నటించింది. పాటలు, కొన్ని సన్నివేశాలకే పరిమితమైంది. ఇక సాఫ్ట్ విలన్‌గా జాకీ ఫ్రాఫ్ తనదైన మార్కుని చూపించారు. మిగితా నటీనటులు తమ తమ పరిధి మేరకు
పర్వాలేదనిపించారు.

సాంకేతికంగా :

విజిల్ టెక్నికల్ గా బాగుంది. ఎఆర్ రెహమాన్ అందించిన సంగీతం బాగుంది. పాటలు, నేపథ్య సంగీతంలోనూ రెహమాన్ మార్క్ కనిపించింది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎరుపు రంగు ఫ్లేవర్‌తో చిత్రీకరించిన సీన్లు చాలా బాగున్నాయి. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు బాగున్నాయి.

బాటమ్ లైన్ : విజిల్.. గట్టిగానే వేశాడు !

రేటింగ్ : 3/5

నోట్ : ఈ సమీక్ష సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.