మహేష్ డబుల్ ట్రీట్


అభిమానుల కోసం దీపావళీ కానుకలు క్యూ కడుతున్నాయ్. దీపావళీ గిఫ్ట్స్ అందించడంలో సంక్రాంతి సినిమాలు మరింత ముందున్నాయి. త్రివిక్రమ్-అల్లు అర్జున్ హ్యాట్రిక్ సినిమా ‘అల.. వైకుంఠపురంలో’ నుంచి మాస్ సాంగ్ ‘రాములో రాముల’ రాబోతుంది. ఇక మరో సంక్రాంతి సినిమా సూపర్ స్టార్ మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ నుంచి అప్పుడే దీపావళీ కానుక వచ్చేసింది. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి లుక్ ని విడుదల చేశారు. ఇదొక్కటే కాదు.. మహేష్ డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్నారు. 

ఈ సాయంత్రం సరిలేరు నుంచి మహేష్ కొత్త పోస్టర్ రిలీజ్ కానుంది. ఇందులో మహేష్ రెండు షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నట్టు ప్రచారం జరిగింది. ఇప్పటికే ఆర్మీ ఆఫీసర్ గా మహేశ్ లుక్ బయటికొచ్చింది. రెండో లుక్ ని ఈ సాయంత్రం వదలబోతున్నట్టు తెలుస్తోంది. అది రాయలసీమ ఫ్యాక్షన్ లుక్ అయి ఉండొచ్చని చెబుతున్నారు. ఈ సినిమాలో మహేష్ కి జంటగా రష్మిక మందన నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. దిల్ రాజు-అనిల్ సుంకర్-మహేష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.