మహేష్ దీపావళి లుక్ అదిరింది !

దీపావళి కానుకగా సినిమాల ఫస్ట్ లుక్కులు, టైటిల్ పోస్టర్స్, టీజర్స్, కొత్త లుక్కులు క్యూ కడుతున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు డబుల్ ట్రీట్ ఇచ్చారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఆయన నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన కథానాయిక. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు. దీపావళి కానుకగా ఈ సినిమా నుంచి విజయశాంతి ఫస్ట్ లుక్ ని ఈ ఉదయ విడుదల చేశారు. తాజాగా సరిలేరు నుంచి మహేష్ కొత్త పోస్టర్ వచ్చేసింది. ఇందులో మహేష్ బుల్లెట్ పై దూసుకెళ్తున్నారు.

దీపావళి కానుకగా ‘సరిలేరు నీకెవ్వరు’ డబుల్ ట్రీట్ అదిరింది. దాదాపు 13యేళ్ల తర్వాత లేడీ సూపర్ స్టార్ విజయశాంతి పోస్టర్ ఒకటికొచ్చింది. అది ఆమె అభిమానులని ఆనందంలో ముంచెత్తించింది. ఇక రెండో కానుక మహేష్ స్టయిలీష్ లుక్ అదిరిపోయింది. సంక్రాంతి సినిమాల ప్రమోషన్స్ లో అల.. వైకుంఠపురంలో సినిమాతో పోలిస్తే సరిలేరు నీకెవ్వరు కాస్త వెనకబడినట్టు కనిపించింది. ఇప్పుడు దీపావళి డబుల్ ట్రీట్ తో సరిలేరు ప్రమోషన్స్ జోరు ని పెంచినట్టయింది. ఈ జోరుని ఇలాగే రిలీజ్ వరకు చూపించబోన్నారట.