‘రాములో రాముల’ ఫుల్ సాంగ్ .. కడుపు నిండిపోయింది !

హిట్ కాంబో క్రేజ్ ఏ రేంజ్ లో ఉంటుందో ‘అల.. వైకుంఠపురంలో’ చూపిస్తోంది. త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కుతోన్న హ్యాట్రిక్ చిత్రమిది. వీరి కలయికలో వచ్చిన జులాయ్, సన్నాప్ సత్యమూరి సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో అల..పై భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టుగానే సినిమా అద్భుతంగా ఉండబోతుందని తొలి పాట ‘సామజవరగమన’తో అర్థమైంది. ఈ పాట ఏకంగా 50మిలియన్ వ్యూస్ సొంతం చేసుకొంది. 7లక్షలకు పైగా లైకులొచ్చాయ్. అత్యధిక వ్యూస్ సొంతం చేసుకొన్న తొలి తెలుగు పాటగా రికార్డ్ సృష్టించింది.

ఇక ఈ సినిమా నుంచి దీపావళీ కానుకగా రెండో సాంగ్ మాస్ సాంగ్ ‘రాములో రాముల’ని రిలీజ్ చేసింది చిత్రబృందం. సాంగ్ అదిరిపోయింది. ఇంకా చెప్పాలంటే కడుపునిండిపోయింది. కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాటని అనురాగ్ కులకర్ణి, మంగిలి కలిసి పాడారు. పాట, పాటలో బన్నీ స్టెప్స్ అదిరిపోయాయ్. ఇద్దరు హీరోయిన్స్ పూజా హెగ్డే, నభా అందాలు హైలైట్ గా నిలిచాయ్. రాములో.. రాముల ఫుల్ సాంగ్ ని మీరు చూసేయండీ.. !