శివసేన ’50-50′ డిమాండ్ కు పవార్ సపోర్ట్


మహారాష్ట్రలో పవర్ ని పంచుకోవాలని ఆశపడుతోంది శివసేన. మహారాష్ట్ర సీఎం పదవీకాలాన్ని 50-50 పంచుకోవాలని డిమాండ్ చేస్తోంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల్లో భాజపా – శివసేన కూటమిగా పోటీ చేసిన విషయం తెలిసిందే. ఫలితాల్లో భాజపాకు 105 సీట్లు రాగా.. శివసేన 56 స్థానాలు గెలుచుకుంది. దీంతో ఆ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది.

సీఎం పదవీకాలాన్ని చెరిసగం పంచుకోవాలని భాజపాను శివసేన డిమాండ్ చేస్తోంది. ఈ డిమాండ్ పై నేషనలిస్ట్ కాంగ్రెస్ అధినేత శరద్ పవార్ స్పందించారు. “శివసేన కొత్తగా ఏం డిమాండ్ చేయడం లేదు. 1990లో కూడా 50-50 ఫార్ములాను వారు అనుసరించారు. ఇంతకు ముందున్న అనుభవం కారణంగా ఇప్పుడు కూడా అదే డిమాండ్ చేస్తున్నారు. దానిలో ఎలాంటి తప్పూ లేదు” అంటూ శివసేనకి మద్దతు పలికారు పవార్.