బిగ్ బాస్3 : ఈ వారం అన్నా-చెల్లెలు అవుట్ ? 

కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ 3 ముగింపునకి చేరుకొంది. ఈ వారమే ఆఖరు. ఆ తర్వాత ఫైనల్ ఏపీసోడ్ జరగనుంది. ప్రస్తుతం బిగ్ బాస్ ఇంట్లో ఆరుగురు.. శ్రీముఖీ, వరుణ్ సందేష్, రాహుల్, అలీ, శివజోతి, బాబా భాస్కర్ ఉన్నారు. వీరిలో రాహుల్ ఇప్పటికే ఫైనల్ బెర్త్ ఖరారైంది. మిగిలిన ఐదుగురులో ఈవారం ఒకరు ఎలిమినేట్ కానున్నారు. అది శివజ్యోతి అనే లీకులు బయటికొస్తున్నాయ్. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే ? ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండోచ్చని చెబుతున్నారు. 

అదే ఉంటే.. ఈ వారం శివజ్యోతితో పాటు, ఆమె అన్నగా ముద్రపడిన అలీ కూడా ఎలిమినేట్ కావొచ్చని చెబుతున్నారు. ఇక మిగిలిన నలుగురిలో రాహుల్, శ్రీముఖి, వరుణ్ సందేశ్, బాబా భాస్కర్ ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. విజేతగా ఎక్కువ అవకాశాలు శ్రీముఖికి ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఐతే, రాహుల్, వరుణ్ లని తక్కువ అంచనా వేయలేం. ఇక బాబా భాస్కర్ అన్నింట్లో ముందున్నా.. తమిళుడు అనే ముద్రపడిపోయింది. మొత్తానికి.. బిగ్ బాస్ 3 విజేత ఎవరనే విషయంలో ప్రస్తుతానికి ఉఠ్కంట కొనసాగుతోంది.