బిగ్ బాస్3 ఈ వారం లీకు.. అలీ అవుట్ !

కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ 3 ఆఖరి అంకానికి చేరుకొంది. ఈ వారంతో విజయవంతంగా 14వారాలని పూర్తి చేసుకొంది. వచ్చే వారం ఫైనల్ ఏపీసోడ్ ప్రసారం కానుంది. దీంతో బిగ్ బాస్ 3 విజేత ఎవరన్నది తేలనుంది. ఐతే, ఈ వారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారన్న వార్త ఎప్పటిలాగే ముందుగానే లీకైంది. ఈ వారంలో ఎలిమినేషన్ లిస్టులో శివజ్యోతి, శ్రీముఖీ, అలీ రెజా, వరుణ్ సందేష్ లు  ఉన్నారు. వీరిలో శ్రీముఖీ సేఫ్ అయినట్టు శనివారం నాగ్ ప్రకటించారు. 

ఇక మిగిలిన ముగ్గురు శివజ్యోతి, అలీరెజా, వరుణ్ సందేష్ లలో శివజ్యోతి ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే ప్రచారం జరిగింది. కానీ, శివజ్యోతి ఈవారం సేఫ్ అయినట్టు సమాచారమ్. ఇప్పటికే ఒకసారి ఎలిమినేట్ అయి.. వైల్డ్ కార్డ్ ఇచ్చిన అలీ రెజా ఈ వారం ఎలిమినేట్ అయినట్టు తెలిసింది. ఇదే నిజమైతే.. ఐదుగురు శ్రీముఖి, రాహుల్, బాబా భాస్కర్, శివజ్యోతి, వరుణ్ సందేష్ లతో ఫైనల్ ఏపీసోడ్ జరగనుంది. మరీ.. వీరిలో బిగ్ బాస్ 3 విజేత ఎవరు అవుతారన్నది తెలియాలంటే మరో వారంరోజుల పాటు వెయిట్ చేయాల్సిందే.