‘భీష్మ’ రొమాంటిక్.. యాక్షన్ లుక్ !


ఆ నడుం ఒంపుసొంపులు చూసి ఆగలేకపోతున్నాడు హీరో నితిన్. అసలే పెళ్లికాలేదు. ఆపై రస్మిక వయ్యారంగా తిప్పుకొంటూ వెళ్తుంటే.. చిట్టినడుమునే చూస్తున్నా అంటూ టెఫ్ట్ అవుతున్నాడు. ఇంతలో ఏమైందో ఏమోగానీ.. యాక్షన్ లోకి దిగిపోయాడు. ఒకేసారి ఐదారుగురు రౌడీలని రఫ్ఫాడించాడు. భీష్మ అందించిన దీపావళీ కానుకలు ఇవి.

వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్-రష్మిక మందన జంటగా ‘భీష్మ’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ‘సింగిల్ ఫరెవర్’ అనేది ట్యాగ్ లైన్. ఐతే, ఫస్ట్ లుక్ లో మాత్రం నితిన్ రొమాంటిక్ గా కనిపిస్తున్నాడు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోంది.’లై’, ‘చల్ మోహన రంగా’, ‘శ్రీనివాస కళ్యాణం’ వరుస ప్లాపుల తర్వాత నితిన్ చేస్తున్న చిత్రమిది. వైవిధ్యమైన కథతో తెరకెక్కుతోన్న భీష్మ తనకి హిట్ ఇస్తుందనే నమ్మకంతో ఉన్నాడు నితిన్. భీష్మ ఈ యేడాది వచ్చే పరిస్థితులు కనబడటం లేదు. సంక్రాంతి సీజన్ ముగిసిన తర్వాత భీష్మ రిలీజ్ ఉండొచ్చని తెలుస్తోంది.