రస్మికకి వంద పెళ్లిచూపులు జరిగాయా !?
రష్మిక మందన ‘ఛలో’ సినిమాతో టాలీవుడ్ లోకి దూసుకొచ్చింది. ‘గీత గోవిందం’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొంది. దేవదాసు, డియర్ కామ్రేడ్ సినిమాలతో ఆకట్టుకొంది. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో నటిస్తోంది. స్టార్ హీరోయిన్ గా ఎదిగే క్రమంలో ఉంది. ఈ విషయం పక్కనపెడితే.. రస్మికకి ఇప్పటికే వంద పెళ్లిచూపులు జరిగాయట. ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కన్నడ చిత్రం ‘కిర్రాక్ పార్టీ’.ఈ సినిమా హీరో రక్షిత్ శెట్టితో రస్మిక ప్రేమలో పడటం. వీరిద్దరి ఎంగేజ్ మెంట్ జరిగిన సంగతి తెలిసిందే.
ఆ తర్వాత రష్మిక తెలుగులో హీరోయిన్ గా బిజీకావడం, మరికొన్ని కారణాలతో రక్షిత్ శెట్టితో పెళ్లి క్యాన్సిల్ చేసుకొందని అందకీ తెలుసు. కానీ, రస్మిక వంద పెళ్లి చూపులని క్యాన్సిల్ చేసుకొందన్న సంగతి ఎవ్వరికీ తెలీదు. ఇదంతా సరిలేరు నీకెవ్వరు సినిమా మేటరు. ఇందులో రస్మిక వంద పెళ్లి చూపులని క్యాన్సిల్ చేసుకుంటుందట. 101 పెళ్లి చూపుల్లో మహేష్ ని చూస్తుందట. పెళ్లి చూపుల సమయంలో రస్మిక, ఆమె కుటుంబ సభ్యులు కలిసి మహేష్ ని ఓ రేంజ్ లో ఆడుకొంటారట.
అది చూడాలంటే వచ్చే యేడాది జనవరి 12 వరకు ఆగాల్సిందే అంటోంది రష్మిక మందన. దీపావళీ కానుకగా సరిలేరు నుంచి శనివారం విజయశాంతి, మహేష్ పోస్టర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇవాళ రష్మిక పెళ్లి కూతురిగా రెడీ అయిన పోస్టర్ ని వదిలారు. ఇందులో రస్మిక ముద్దుగా రెడీ అయి.. తనని చూసుకోవడానికి వస్తున్న 101వ పెళ్లి కొడుకు మహెశ్ కోసం వెయిట్ చేస్తోంది.
‘How to get a guy 101.’ This me and my family will teach you on the 12 of jan 2020 – stay tuned 😉
Team #SarileruNeekevvaru wishes you a very Happy #Diwali 🎆🎇💥@urstrulyMahesh @AnilRavipudi@AnilSunkara1 @ThisIsDSP @RathnaveluDop @AKentsOfficial @SVC_official @GMBents ♥️✨ pic.twitter.com/FTAFOvv79g
— Rashmika Mandanna (@iamRashmika) October 27, 2019