స్వీటీ ‘సలైన్స్’కు మహేష్ మ్యూజిక్ !


‘భాగమతి’ తర్వాత స్వీటీ అనుష్క నటిస్తున్న చిత్రం ‘సలైన్స్’. హేమంత్ మధుకర్ దర్శకుడు. ఇందులో మాధవన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆయన సెలబ్రెటీ మ్యూజిషియన్ అంథోని పాత్రలో నటిస్తున్నారు. ఇటీవలే మాధవన్ లుక్ ని రిలీజ్ చేశారు. దీపావళీ కానుకగా సలైన్స్ ప్రీ టీజర్ ని విడుదల చేశారు. నవంబర్ 7న టీజర్ ని విడుదల చేయబోతున్నట్టు తెలిపారు.

ఇక ప్రీ టీజర్ సుకుమార్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ నటించిన ‘వన్ నేనొక్కడినే’ చిత్రాన్ని గుర్తుకు తెస్తోంది. మరీ.. ముఖ్యంగా నేపథ్య సంగీతాన్ని మక్కీకి మక్కిగా దించేసినట్టు కనబడుతోంది. ఈ చిత్రంలో అంజలి, హాలీవుడ్ యాక్టర్ మైకేల్ కీలక పాత్రలో కనిపించనున్నారు. తెలుగు, తమిళ్, హిందీ బాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ చిత్రాన్ని కోన వెంకట్ నిర్మిస్తున్నారు.