బిగ్ బాస్3 ఇప్పుడు బ్యాలెన్స్ అయింది !


బిగ్ బాస్ 3 ఈ వారంతో 14వారలని విజయవంతంగా పూర్తి చేసుకొంది. మరో వారం మాత్రమే మిగిలింది. ఐదుగురితో ఫైనల్ ఏపీసోడ్ జరగనుంది. ప్రస్తుతం ఆరుగురు ఇంట్లో ఉన్నారు. వీరిలో ముగ్గురు రాహుల్, బాబా భాస్కర్, శ్రీముఖి ఫైనల్ కు చేరుకొన్నారు. ఇక మిగిలిన ముగ్గురు శివజ్యోతి, అలీ రెజా, వరుణ్ సందేష్ లలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ కానున్నారు. దీంతో ప్రస్తుతం బిగ్ బాస్ 3 బ్యాలెన్స్ గా కనిపిస్తోంది. ఇటు ముగ్గురు, అటు ముగ్గురుగా కనిపిస్తున్నారు.

శివజ్యోతి, అలీ రెజా, వరుణ్ సందేశ్ లలో ఈ వారం శివజ్యోతి ఎలిమినేట్ కావొచ్చని చెబుతున్నారు. అలీ కూడా హిట్ లిస్ట్ లో ఉన్నారు. ఈ ఇద్దరు ఒకరు ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక వరుణ్ సందేష్ కి సేవ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తోంది. బిగ్ బాస్ టైటిల్ పోరు మాత్రం శ్రీముఖి, రాహుల్, వరుణ్ తేజ్ ల మధ్య గట్టిపోటీ ఉండనుందని చెబుతున్నారు.