విజయ్’కి మాత్రమే చెప్పిన బిగ్ బాస్ సీక్రెట్స్ !

బిగ్ బాస్ 3 ఆఖరి అంకానికి చేరుకొంది. ఈ వారంతో విజయవంతంగా 14వారాలని పూర్తి చేసుకొంది. మరోవారంతో బిగ్ బాస్ 3 ముగియనుంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ 3 విజేత ఎవరు అవుతారు ? అన్నది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం బిగ్ బాస్ ఇంట్లో ఆరుగురు సభ్యులు శ్రీముఖీ, శివజ్యోతి, రాహుల్, వరుణ్ సందేష్, అలీరెజా, బాబా భాస్కర్ ఉన్నారు. వీరిలో ఈ వారం ఒకరు ఎలిమినేట్ కానున్నారు. ఈ ఆరుగురిలో ముగ్గురు శివజ్యోతి, అలీరెజా, వరుణ్ సందేష్ ఎలిమినేషన్ లిస్టులో ఉన్నారు. వీరిలో ఒకరు ఈ వారం బయటికి వెళ్లనున్నారు. అదెవ్వరు అన్నది ఆసక్తిగా మారింది. 

ఈ విషయం పక్కన పెడితే.. ఈరోజు షోలో విజయ్ దేవరకొండ సందడి చేయనున్నాడు. దానికి సంబంధించిన ప్రోమోని స్టార్ మా కొద్దిసేపటి క్రిత్రమే విడుదల చేసింది. విజయ్ నిర్మాతగా తరుణ్ భాస్కర్ హీరోగా తెరకెక్కిన ‘మీకు మాత్రమే చెప్తా’ వచ్చే వారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ బిగ్ బాస్ స్టేజ్ పై సందడి చేయనున్నాడు. ఇక ఈ షోలో బిగ్ బాస్ ఇంటి సభ్యుల నుంచి ఇంతవరకు ఎవరికీ తెలియని బిగ్ బాస్ సీక్రెట్ ని అడిగి తెలుసుకొనే ప్రయత్నం చేసినట్టు ప్రోమో చూస్తే అర్థమవుతోంది. అదెంత మజా వచ్చిందన్నది.. తెలియాలంటే.. రాత్రి 9గంటల వరకు వెయిట్ చేయాల్సిందే.