ఐసిస్ అధినేత బాగ్దాదీ హతం
ప్రపంచ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్, ఐసిన్ అధినేత అబు బకర్ అల్ బగ్దాదీని హతమయ్యాడు. బాగ్దాదీని అమెరికా దళాలు ఆదివారం హతమార్చాయి. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధ్రువీకరించారు.వేలమంది అమాయకులను తన ఉగ్రకార్యకలాపాలతో చంపిన బాగ్దాదీ చివరి క్షణాల్లో ఎంతో పిరికివాడిగా మరణించినట్లు ట్రంప్ వెల్లడించారు.
బాగ్దాదీ మృతిపై ట్రంప్ మాట్లాడుతూ.. ‘బాగ్దాదీ తనంతట తానే పేల్చుకుని మృతి చెందాడు. అమెరికా భద్రతా దళాలు బాగ్దాదీని వెంబడించిన సమయంలో అతడు ఏడుస్తున్నట్లు గమనించినట్లు, బాగ్దాదీ తన ముగ్గురు పిల్లలను చంపి తాను ఆత్మాహుతికి పాల్పడినట్లు ట్రంప్ చెప్పారు.
బగ్దాదీని అంతమొందించడం ఒక గొప్ప విజయం అని అమెరికా రక్షణశాఖ మంత్రి మార్క్ ఎస్పర్ అన్నారు. కొన్ని దేశాల సహకారంతో గతంలో ఐసిస్ రాజ్యాన్ని కూలదోశామని.. ప్రస్తుతం దాని అధినేతను కూడా తుదముట్టించామని తెలిపారు. అయితే దీంతో ఐసిస్ కథ ముగిసినట్లు కాదని.. ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన దానిని మూలాలను తుడిచిపెట్టాల్సిన అవసరం ఉందన్నారు.