వైకాపా పాలించడానికి పనికిరాదు : కన్నా
ఏపీ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ట్విట్టర్ వేదికగా వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రంగులు వేసుకోవడానికి, ఆర్భాటం చేయడానికి తప్ప వైకాపా పాలించడానికి పనికిరాదన్నారు. ఇంత అసమర్థత కలిగిన ప్రభుత్వాన్ని తాను ఎప్పుడూ చూడలేదన్నారు. గత ఎన్నికల్లో ప్రజలు 151 సీట్లు ఇచ్చినందుకు ఇసుక కొరతను వారికి రిటర్న్ గిఫ్ట్ గా ఇచ్చారంటూ ఎద్దేవా చేశారు. భవన నిర్మాణ కార్మికులకు రూ.150ల కూలీ కూడా రావడంలేదన్నారు.
ఇక తెలుగు రాష్ట్రాల్లో భాజాపా బలపడేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఏపీలో తెదేపా, తెలంగాణలో కాంగ్రెస్ నుంచి భారీగా నేతలని చేర్చుకుంటోంది. రెండు రాష్ట్రాల్లో ప్రధాన ప్రతిపక్షంగా ఎదగాలని.. ఆ తర్వాత అధికారం చేపట్టే దిశగా పార్టీని బలోపేతం చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఇందు కోసం ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా రంగంలోకి దిగారు. ఆయన తెలంగాణ ప్రాంతం నుంచే పార్టీ క్రియాశీల సభ్యత్వాన్ని తీసుకొన్న సంగతి తెలిసిందే.