విష్ణు ఇంట్లో ప్రభాస్ సందడి

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరో మంచు విష్ణు ఇంట్లో సందడి చేశారు. దీపావళి పండుగ సందర్భంగా శనివారం సాయంత్రం మంచు విష్ణు నివాసంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేడుకకు ప్రభాస్‌ హాజరయ్యారు. ప్రభాస్-విష్ణు సరదాగా ముచ్చటించుకొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు మంచు విష్ణు తన ఇస్ట్రో గ్రామ్ లో షేర్ చేశారు.’నా సోదరుడు ప్రభాస్‌తో చాలా రోజుల తర్వాత సరదాగా గడిపాను. సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకూ చాలా సంతోషంగా గడిచింది’ అని రాసుకొచ్చారు.

దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి కూడా మంచి విష్ణు ఇంటికి విచ్చేశారు. 
బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సాహో సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ప్రస్తుతం ప్రభాస్ రాథాకృష్ణ దర్శకత్వంలో ఓ ప్రేమకథా చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్. ఇది కూడా భారీ బడ్జెట్ చిత్రమే. కాకపోతే.. సాహో రిజల్ట్ తర్వాత కాస్టింగ్ చేసినట్టు తెలిసింది. ఇటీవల ఈ సినిమా షూటింగ్‌ యూరప్‌లో జరిగింది. త్వరలోనే కొత్త షెడ్యూల్ మొదలవ్వనుంది.