ఆ హీరోయిన్ బిర్యానీబోతు


ఎప్పుడు తినే వాళ్లని ఏమంటారు తిండిబోతు అంటుంటారు. పొద్దున్నే లేవగానే బిర్యానీ తినేవాళ్లని ఏమనాలి ? బిర్యానీబోతు అనాలేమో.. ! ఆ లెక్కన హీరోయిన్ ప్రియానంద్ ని బిర్యాని బోతు అనొచ్చేమో. ఆమెకి బిర్యానీ అంటే ఇష్టమట. కాదు ప్రాణమట. కొన్ని సార్లు ఉదయం లేవగానే బిర్యానీ తిన్న రోజులున్నాయని చెప్పింది ప్రియా. 

దగ్గుపాటి రానా ఎంట్రీ సినిమా ‘లీడర్’లో ప్రియానంద్ పాత్రని మర్చిపోలేం. రానాపై మనసు పారేసుకొన్న యువతి పాత్రలో ఆకట్టుకుంది.. ఆ తర్వాత పలు తెలుగు, తమిళ సినిమాలతో తెలుగు ప్రేక్షకులని పలకరించింది. ప్రస్తుతం ప్రియా మరోసారి బిజీ అయింది. వరుసగా సినిమాలు చేస్తోంది. ఆమె నటించిన ‘ఎల్‌కేజీ’ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రస్తుతం ప్రియా ఆనంద్‌.. ధ్రువ్‌ విక్రం నటిస్తున్న ‘ఆదిత్య వర్మ’లో ముఖ్యపాత్ర పోషిస్తోంది. శివకు జోడీగా ‘సుమో’ చిత్రంలోనూ నటిస్తోంది.