రాముల రికార్డ్ కొట్టింది !

ఈసారి సినిమా ప్రమోషన్స్ తోనే రికార్డులని తెరలేపాడు స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న హ్యాట్రిక్ చిత్రం ‘అల.. వైకుంఠపురంలో’. పూజా హెగ్డే కథానాయిక. బాలీవుడ్ నటి టబు కీలక పాత్రలో నటిస్తున్నారు. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న అల.. ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సంక్రాంతి సినిమా ప్రమోషన్ కార్యక్రమాలని దసరా నుంచే మొదలెట్టిన సంగతి తెలిసిందే. తొలి పాట ‘సామజవరగమన’ ని రిలీజ్ చేశారు. అది వైరల్ అయింది. అత్యధిక వ్యూస్ (50మిలియన్), లైక్స్ (7లక్షలు) సొంతం చేసుకొన్న తొలి తెలుగు పాటగా రికార్డ్ సృష్టించింది. 

ఇక దీపావాళీ కానుకగా అల.. నుంచి రెండో పాట మాస్ సాంగ్ ‘రాములో రాముల’ రిలీజైన సంగతి తెలిసిందే. రాములో దుమ్ములేపుతోంది. రిలీజైన 24గంటల్లోనే  8.3 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. 24 గంటల్లో ఈ స్థాయిలో వ్యూస్ ను సాధించిన మొదటి సౌత్ ఇండియన్ సాంగ్ గా ‘రాములో రాములా’ కావడం విశేషం. మొత్తానికి.. అల.. పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ ని

సొంతం చేసుకుంటున్నాయ్. సినిమా కూడా ఆ రేంజ్ లో ఉంటే ఇండస్ట్రీ రికార్డులు బద్దలైనట్టే.
ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. గీతా ఆర్ట్స్, హారిక & హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.