‘జోకర్’పై సమంత కామెంట్


గాంధీ జయంత్రి అక్టోబర్ 2 కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రాల్లో ‘జోకర్’ ఒకటి. బాలీవుడ్ చిత్రం ‘వార్’, తెలుగు సినిమా ‘సైరా’తో హాలీవుడ్ సినిమా ‘జోకర్’ పోటీ పడింది. మంచి కలెక్షన్స్ సాధించింది. ‘జోకర్’ బాగున్నాడు అంటూ నెటిజన్స్, సినీ ప్రముఖులు కితాబిచ్చారు. ఆదివారం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ‘జోకర్’ సినిమాని చూశారు. 

‘నేను ఇప్పటి వరకూ చూసిన చిత్రాల్లో ‘జోకర్‌’ చాలా గొప్ప సినిమా. జోక్విన్‌లాగా మరొకరు ఉండరు’ అని సమంత ఇన్‌స్టా వేదికగా తెలిపారు. ఇక ఈ ఏడాది కూడా సామ్ విజయ యాత్ర కొనసాగుతూనే ఉంది. ఈ యేడాది ఆమె ‘మజిలీ’, ‘ఓ బేబి’ సినిమాతో విజయాలు అందుకొంది. ప్రస్తుతం 96 తెలుగు రిమేక్ లో నటిస్తున్నారు. ఇందులో ఆమె శర్వానంద్ కి జంటగా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. వచ్చే యేడాది ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తోంది. మాతృకను తీసిన సి.ప్రేమ్‌ కుమార్‌ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. దిల్ రాజు నిర్మించారు.