ఆ ఏడుపు ముగిసింది

ఎమోషన్ డోస్ ఎక్కువైనా ఫ్యామిలీ ఆడియెన్స్ చిరాకు పడరారని బిగ్ బాస్ 3 షో, అందులో శివజ్యోతిని చూస్తే అర్థమైంది. శివజ్యోతి బలమైన కంటెస్టెంట్ గా కనిపించింది. ఆమె తెలంగాణ ప్రజానీకం నుంచి ప్రత్యేక మద్దతు లభించినట్టు అనిపించింది. ప్రతి విషయంలోనూ క్లారిటీగా కనిపించిన శివజ్యోతికి ఎమోషన్స్ ఎక్కువే. అది మొదట్లో ఆమెకి హెల్ప్ అయింది. శివజ్యోతి క్యారెక్టర్ తో ఎమోషనల్ గా కనెక్ట్ అయినవారు ఉన్నారు ఐతే, శృతిమించి మైనస్ అయింది కూడా. ఇప్పుడు బిగ్ బాస్ ఇంట్లో ఆ ఏడుపు ముగిసింది.

ఈ వారం బిగ్ బాస్ 3 నుంచి శివజ్యోతి ఎలిమినేట్ అయ్యారు. ఫైనల్ ఏపీసోడ్ కు ఒక్క అడుగు ముందర శివజ్యోతి జర్నీ ముగిసింది. ఈ వారం ఎలిమినేషన్ లిస్టులో ఉన్న ముగ్గురు అలీ రెజా, శివజ్యోతి, వరుణ్ సందేష్ లలో శివజ్యోతికి తక్కువ ఓట్లు రావడంతో ఆమె ఎలిమినేట్ అయినట్టు నాగార్జున ప్రకటించారు. ఇక ఆదివారం ఏపీసోడ్ లో ‘మీకు మాత్రమే చెప్తా’ చిత్రబృందం సందడి చేసింది.

ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ తన పెళ్లి రూమర్స్ పై ఆసక్తికర సమాధానం చెప్పారు. అమల కోసం వెతుకుతున్నాని.. నాగ్ తో సరదాగా అన్నారు. ఇక ఐదుగురు సభ్యులు శ్రీముఖీ, బాబా భాస్కర్, వరుణ్ సందేష్, అలీ రెజా, రాహుల్ లతో బిగ్ బాస్ ఫైనల్ ఏపీసోడ్ జరగనుంది. వీరిలో ఎవరు బిగ్ బాస్ 3 విజేత అవుతారన్నది చూడాలి.