బిగ్ బాస్ హౌస్‌’లో సుమ రచ్చ చూస్తారా ?


యాంకర్ సుమ ఎక్కడ ఉంటే అక్కడ రచ్చ రచ్చే. ఇప్పుడా ఆమె బిగ్ బాస్ హౌస్‌ లో రచ్చ చేయబోతుంది. ఇదీ నిజం. ఈ రోజు రాత్రి ప్రసారమయ్యే షోలో సుమ కనిపించినుంది. దీనికి సంబంధించిన ప్రోమోని స్టార్ మా కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేసింది. ఇందులో హౌస్‌  సభ్యులతో సుమ చేసిన రచ్చ మాములుగా ఉండని అర్థమవుతోంది. 

బిగ్ బాస్ 3 ఈ వారంతో ముగియనుంది. ప్రస్తుతం హౌస్‌ లో ఐదుగురు సభ్యులు మాత్రమే ఉన్నారు. శ్రీముఖీ, వరుణ్ సందేష్, రాహుల్, అలీ రెజా, బాబా భాస్కర్ టైటిల్ పోరుకి రెడీ అయ్యారు. వీరిలో బిగ్ బాస్ 3 విజేత ఎవరు అవుతారనే ఆసక్తి నెలకొంది. మొదటి నుంచి బిగ్ బాస్ 3లో ఊహించినవే జరుగుతున్నాయ్. మరీ.. టైటిల్ విన్నర్ విషయంలో అందుకు భిన్నంగా జరుగుతుందా ? అన్నది చూడాలి. బయట ప్రచారం మాత్రం బిగ్ బాస్ 3 టైటిల్ విజేత శ్రీముఖి అనే ప్రచారం జరుగుతోంది. ఆమె కాకుండా మరొకరు బిగ్ బాస్ 3 విజేతగా నిలిస్తే అది సంచలనమే. మరీ.. ఆ సంచలనం సృషించేవారు ఎవరన్నది చూడాలి.