ప్రభాస్ పై ప్రేమని ఇన్నాళ్లకి బయటపెట్టింది !
ప్రభాస్ – స్వీటీ అనుష్క ప్రేమ, పెళ్లిపై జోరుగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. వీరిద్దరు బాహుబలి షూటింగ్ టైంలో ప్రేమలో పడ్డారు. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు జోరుగా ప్రచారం జరిగింది. దీనిపై ప్రభాస్, స్వీటీ ఇద్దరు క్లారిటీ ఇచ్చినా ప్రచారం మాత్రం ఆగడం లేదు. వాస్తవానికి అనుష్క కంటే ముందు కాజల్ తో ప్రభాస్ ప్రేమలో పడినట్టు వార్తలొచ్చాయ్.
వీరిద్దరు కలిసి డార్లింగ్, మిస్టర్ ఫర్ ఫెక్ట్ సినిమాల్లో నటించారు. బాహుబలి తర్వాత ప్రభాస్ కాజల్ ని పట్టించుకోవడం లేదనే గుసగుసలు వినిపించాయ్. ఇప్పుడు అవి నిజమే అన్నట్టు ప్రభాస్ పై తనకున్న ప్రేమని బయటపెట్టింది కాజల్. ప్రభాస్ ని పెళ్లి చేసుకొంటానని ఓపెన్ గా చెప్పేసింది. మంచు లక్ష్మీ హోస్ట్ గా వ్యవహరిస్తున్న షోలో పాల్గొన్న కాజల్ కి… తారక్, రామ్ చరణ్, ప్రభాస్ లలో ఎవరిని చంపేస్తారు? ఎవరితో డేటింగ్ చేస్తారు? ఎవరిని పెళ్లి చేసుకొంటారు ? అనే ప్రశ్న ఎదురైంది.
దానికి కాజల్ రామ్ చరణ్ ణి చంపేస్తా. తారక్ తో డేటింగ్ చేస్తా. ప్రభాస్ ని పెళ్లి చేసుకొంటానని తెలిపింది. దీంతో.. గతంలో ప్రభాస్ తో కాజల్ ప్రేమలో పడిందనే వార్తలు నిజమేననే గుసగుసలు వినిపిస్తున్నాయ్. ఐతే, కాజల్ సమాధానం వెనక ఓ లాజిక్ కూడా ఉంది. తారక్, చరణ్, ప్రభాస్ లలో ప్రభాస్ కి మాత్రమే పెళ్లి కాలేదు. అందుకే ఆయన్ని ఎంచుకొని ఉంటుందేమో.. !