‘మీకు మాత్రమే చెప్తా’ సెన్సార్ రివ్యూ
హీరో విజయ్ దేవరకొండ నిర్మాతగా మారి చేసిన సినిమా ‘మీకు మాత్రమే చెప్తా’. ఈ సినిమాకు షమీర్ సుల్తాన్ దర్శకుడు.దర్శకుడు తరుణ్ భాస్కర్ కీలకపాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో అభినవ్ గౌతమ్, అనసూయ భరద్వాజ్ మరో రెండు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ వారమే (నవంబర్ 1) ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలని పూర్తి చేసుకొంది.’యు/ఎ’ సర్టిఫికెట్ పొందింది.సెన్సార్ సభ్యుల నుంచి మంచి టాక్ వచ్చిందని చిత్రబృందం తెలిపింది. ఈ చిన్ని సినిమా పెద్ద విజయం సాధిస్తుందని సెన్సార్ సభ్యులు అన్నట్టు టాక్. ఈ సినిమా కోసం సుమారు రెండు కోట్ల బడ్జెట్ ని ఖర్చు పెట్టారు. ఆ మొత్తం అప్పడే వచ్చేసింది. ఫస్ట్ కాపీని డిస్ట్రిబ్యూటర్ ఆషియన్ సునీల్ కు అమ్మడం ద్వారా నిర్మాణ ఖర్చులు తెచ్చేసుకున్నారు. ఆపై డిజిటల్, శాటిలైట్ హక్కులు అమ్మడం ద్వారా టేబుల్ ప్రాఫిట్ కూడా వచ్చేసింది. ఈ సినిమాని విజయ్ ఓ రేంజ్ లో ప్రచారం చేస్తున్నారు. ఆయనకున్న క్రేజ్ దృష్ట్యా సినిమాని జనాల్లోకి తీసుకెళ్లగలిగారు. ఇక సినిమాకి ఏమాత్రం మంచి టాక్ వచ్చిన కలెక్షన్స్ అదిరిపోవడం ఖాయం.