పవన్ పై పూనమ్ సటైర్ !

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో లింకుపెట్టి మాజీ హీరోయిన్ పూనమ్ కౌర్ పై బోలోడు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. పూనమ్ కూడా పలుమార్లు పవన్ పై పరోక్ష కామెంట్స్ చేసింది. దాంతో.. వీరిద్దరి మధ్య అసలేం జరిగింది ? అన్నది సస్పెన్స్ గా మారింది. తాజాగా పూనమ్ పెట్టిన ఓ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఆ ట్విట్ చూసినోళ్లంతా దాన్ని పవన్ కు అన్వయిస్తున్నారు.

“ఓ అబద్ధాలకోరు రాజకీయ నాయకుడు కాగలడు కానీ, లీడర్ మాత్రం కాలేడు” అంటూ ట్విట్ చేసింది. జస్ట్ ఏ థాట్ (ఓ చిన్న ఆలోచన) మాత్రమే అనే యాష్ ట్యాగ్ ని జత చేసింది. పూనమ్ ఎవరి పేరుని పేర్కొనలేదు. కానీ అది పవన్ పై పూనమ్ వేసిన సటైర్ అని అందరికీ అర్థమైపోతుంది. ఇంతకీ పూనమ్ కి పవన్ చేసిన అన్యాయం ఏంటన్నది అంతుచిక్కని ప్రశ్న. గతంలోనూ.. పూనమ్ పవన్ పై పరోక్షంగా విమర్శలు చేస్తూనే.. ఓ బడా దర్శకుడిపై పరోక్షంగా కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆ బడా దర్శకుడు పవన్ కి ఆప్తమిత్రుడు. పూనమ్ నుంచి పవన్ ని కాపాడింది.. ఆ దర్శకుడే అయి వుంటాడేమో!. ఏదేమైనా.. పవన్ వలన పూనమ్ కి ఫ్రీ పబ్లిసిటీ మాత్రం దక్కుతోంది.