‘మెగా ఫ్యామిలీ’ని టార్గెట్ చేసిన వర్మ !

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ మెగా ఫ్యామిలీపై పడిపోయాడు. ఆయన తాజా చిత్రం ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’. ఈ సినిమా తర్వాత చేయబోయే సినిమాని వర్మ ప్రకటించారు. అదే ‘మెగా ఫ్యామిలీ’. టైటిల్ తోనే అర్థమవుతోంది.. ఈ సారి వర్మ మెగా ఫ్యామిలీని టార్గెట్ చేయబోతున్నట్టు. మెగా కాంపౌండ్ కు వర్మకు ఎప్పుడూ పడదనే విషయం అందరికీ తెలిసిందే. 

గతంలో చిరంజీవి హీరోగా వర్మ దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభమై ఆగిపోయింది. మెగా బ్రదర్ నాగబాబు వర్మని డైరెక్టర్ గా టార్గెట్ చేసిన సందర్భాలున్నాయ్. ఓ సందర్భంలో ఏం పీకలేరు అంటూ రామ్ చరణ్ కౌంటర్ కూడా ఇచ్చారు.’మెగా ఫ్యామిలీ’ టైటిల్ తో సినిమా తీయబోతున్న వర్మ.. ఏం చూపించబోతున్నాడు అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

మెగా హీరోల మేనరిజంపై సటైర్స్ వేస్తారా ? లేక మెగాస్టార్ చిరంజీవి మహావృక్షాన్ని ఆసరగా చేసుకొని మెగా హీరోలు ఎలా ఎదిగారని చూపిస్తారా ? లేదంటే సినీ పరిశ్రమలో మెగా ఫ్యామిలీ ఆధిపత్యాన్ని తనదైన శైలిలో ఆవిష్కరిస్తారా ?? మెగా ఫ్యామిలీ కారణంగా నాశమైనట్టు ప్రచారం జరిగిన వారి జీవిత ఘటనలని చూపిస్తారా ?? అన్నది ఆసక్తిగా మారింది. మొత్తానికి.. ఈ సారి వర్మ టార్గెట్ మెగా ఫ్యామిలీ అన్నది మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. మరీ.. మెగా అభిమానులు ఊరుకొంటారా ? వారు వర్మని తగులుకోవడం ఖాయం.