గూగుల్ సెర్చ్ మరింత ఈజీగా !
సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ తమ సెర్చ్ ఇంజిన్ ని మరింత ఈజీగా ఉండేలా తీర్చిదిద్దుతోంది. ఇందులో భాగంగా 13 కొత్త extensionsను ధర్డ్ పార్టీ వెబ్ సైట్లకు యాడ్ చేసింది. వీటి ద్వారా సెర్చ్ చేయడం మరింత తేలికా కానుంది. ఆ extensions ఏంటో ఓ లుక్కేద్దాం పదండీ.. !
Playlist.new – దీని ద్వారా Spotify లో మీరు కొత్తగా ప్లే లిస్ట్ క్రియేట్ చేసుకోవచ్చు
Story.new – మీరు ఏం రాయాలనుకున్నారో దీని ద్వారా నేరుగా రాయవచ్చు
Sell.new – దీని ద్వారా మీరు ఈబేలో ఏం కొనుగోలు చేయాలనుకుంటున్నారో చేయవచ్చు
Canva.new – అందమైన డిజైన్లను దీని ద్వారా తయారుచేసుకోవచ్చు
Reservation.new – రెస్టారెంట్లలో టేబుల్ కోసం మీరు దీన్ని ఉపయోగించుకోవచ్చు
Word.new – spelling, grammar and even stylistic writing suggestions వంటి వాటిని దీని ద్వారా చేయవచ్చు. కాన్ఫిడెన్స్ తో మీరు రాయవచ్చు.
Webex.new – మీ పర్సనల్ మీటింగ్ కు సంబంధించిన వివరాలను దీనిలో పొందుపరుచుకోవచ్చు
Link.new, -Invoice.new – వీటి ద్వారా మినిమైజ్ లింకులను అలాగే ఇన్ వాయిస్ లను తయారుచేసుకోవచ్చు.
వీటన్నింటికీ కొత్త డొమైన్స్ HTTPS encrypted అయి ఉండాల్సి ఉంటుంది. ట్రేడ్ మార్క్ ఓనర్స్ రిజిస్టర్ ట్రేడ్ మార్క్ కలిగి ఉండాలి. కొత్త డొమైన్లు జనవరి 14, 2020 నుంచి పనిచేస్తాయి. కొత్తవాటికి డిసెంబర్ 2నుంచి అప్లయి చేసుకోవాలి.