దీపావళి ఎఫెక్ట్ : బంగ్లాతో తొలి టీ20 వేదిక మార్పు ?

ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానం వేదికగా నవంబర్ 3న బంగ్లాదేష్-భారత్ ల మధ్య తొలి టీ20 మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ పై దీపావళి ఎఫెక్ట్ పడేలా కనిపిస్తోంది. దీపావళి పండగ నేపథ్యంలో ఢిల్లీలోని గాలి పూర్తిగా పాడైపోయింది. కాలుష్య స్థాయి పెరిగిపోవడంతో శ్వాసకు సంబంధించిన వ్యాధులు వస్తాయని భయపడిపోతున్నారు స్థానికులు. ఈ నేపథ్యంలో బంగ్లాతో తొలి టీ20 వేదికని మార్చాలని పర్యావరణ వేత్తలు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీకి లేఖ రాశారు. 

‘గాలిలో కాలుష్య స్థాయి హెచ్చుగా ఉండనుంది. బంగ్లాతో నవంబర్ 3న జరగనున్న తొలి టీ20 మ్యాచ్ ని ఢిల్లీకి బయట ప్రాంతంలో  నిర్వహించాలని కోరుతున్నాం. మన క్రికెటర్లు 3 నుంచి 4గంటల వరకూ శారీరకంగా పోరాడాలి. ఈ గాలిలో అంతసేపు ఆడితే వారి ఆరోగ్య పరిస్థితి దెబ్బతింటుంది’ పర్యావరణవేత్తలు గంగూలీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. మరీ.. ఈ లేఖపై గంగూలీ ఎలాంటి నిర్ణయం తీసుకొంటారు ? అనేది చూడాలి.