షకీబ్ రాజీనామా


బంగ్లాదేష్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్‌ పై ఐసీసీ రెండేళ్ల నిషేధాన్ని విధించిన సంగతి తెలిసిందే. తనని బుకి సంప్రదించిన విషయాన్ని షకీబ్ ముందే చెప్పకపోవడంతో ఈ చర్యలు తీసుకొంది. భారత బుకీ దీపక్ అగర్వాల్ షకీబ్ ని మూడు సార్లు సంప్రదించాడు. 2017 బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌ (బీపీఎల్‌) సందర్భంగా ఒకసారి, 2018 జనవరిలో ఒకసారి, ఏప్రిల్‌లో ఐపీఎల్లో మరోసారి సంప్రదించాడు. ఈ విషయాన్ని షకీబ్ ముందుగానే ఐసీసీకి తెలియజేయలేదు. ఆ తర్వాత జరిగిన విచారణలో విషయాన్ని బయటపెట్టాడు. ఫలితంగా అతనిపై రెండేళ్ల పాటు నిషేదం విధిస్తున్నట్లు ఐసీసీ నిర్ణయం తీసుకొంది.

రెండేళ్ల నిషేధం నేపథ్యంలో ఎంసీసీ(మార్లిబోన్ క్రికెట్ క్లబ్) ప్రపంచ క్రికెట్ కమిటీ నుంచి షకీబ్ స్వయంగా తప్పుకొన్నాడు. 2017లో షకీబ్ ఎంసీసీ వరల్డ్ క్రికెట్ కమిటీలో చేరాడు. క్రికెట్‌లో సమస్యలపై చర్చించడానికి ఏటా రెండుసార్లు ఈ కమిటీ మీటింగ్ జరుగుతుంది.సిడ్నీ, బెంగళూరు వేదికగా జరిగిన రెండు మీటింగ్‌లకు అతడు హాజరయ్యాడు. ఇక, రెండేళ్ల నేషేధం నేపథ్యంలోషకీబ్ వచ్చే యేడాది జరగనున్న టీ20 వరల్డ్ కప్ కి దూరం కానున్నాడు.