బిగ్ బాస్ 3 : గీతా మాధురి సపోర్ట్ ఎవరికంటే ? 

బిగ్ బాస్ 3 ఈ వారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ 3 విజేతగా ఎవరు నిలుస్తారనే ఉత్కంఠ నెలకొంది. 15 మంది కంటిస్టెంట్లతో మొదలైన బిగ్ బాస్ షోలో ఐదుగురు మాత్రమే టైటిల్ రేసులో నిలిచారు. రాహుల్ సిప్లిగంజ్, శ్రీముఖి, బాబా భాస్కర్, అలీ రెజా, వరుణ్ సందేశ్ టైటిల్ కోసం పోటీ పడుతున్నారు. ఈ ఐదుగురు బిగ్ బాస్ టైటిల్ గెలుచుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. బిగ్ బాస్ 3 విజేత ఎవరనే దానిపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. 

మరోవైపు, తనకిష్టమైన వారిని ఆఖరి మెట్టుమీద నుంచి గట్టెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే హాట్ యాంకర్ రష్మీ తన సపోర్ట్ శ్రీముఖీకే అంటూ ఓ వీడియోని విడుదల చేసిన సంగతి తెలిసిందే. జబర్థస్త్ నటుడు రామ్ ప్రసాద్ కూడా శ్రీముఖినే సపోర్ట్ చేశారు. తాజాగా సింగర్, బిగ్ బాస్ 2 టైటిల్ రన్నర్ గీతా మాధురి బిగ్ బాస్ 3లో తన సపోర్ట్ ఎవరికి అన్నది తేల్చేసింది.

ప్రస్తుతం బిగ్ బాస్ ఇంట్లో ఉన్న ఐదుగురికి గీతా మాధురి ఆల్ ది బెస్ట్ చెప్పింది. దీంతో పాటు శ్రీముఖి, రాహుల్ సిప్లిగంజ్ లతో తాను దిగిన పిక్స్ షేర్ చేసింది. దీంతో గీతా మాధురి సపోర్ట్ వీరిద్దరికే అనే తేలిపోయింది. ఇక టైటిల్ పోరులో  రాహుల్, వరుణ్ సందేష్, శ్రీముఖి ల మధ్య గట్టిపోటీ ఉండేలా కనబడుతోంది.