విక్రమ్ తో చరణ్ సినిమా నిజమే.. కానీ !
విక్రమ్ కె కుమార్ సినిమాలు భిన్నంగా ఉంటాయ్. కానీ, కమర్షియల్ గా ఆడవ్ అనే ముద్రపడిపోయింది. హలో, గ్యాంగ్ లీడర్ సినిమాలకి పాజిటివ్ టాక్ వినిపించింది. కానీ, కమర్షియల్ ఆడలేదు. ఇక స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా విషయంలో విక్రమ్ ఇమేజ్ డ్యామేజ్ అయింది. అయినా.. నాని తో గ్యాంగ్ లీడర్ తీసిన విక్రమ్ హిట్ మాత్రం కొట్టలేకపోయాడు. ఇప్పుడీ దర్శకుడు రామ్ చరణ్ తో ఓ సినిమా చేయబోతున్నట్టు వార్తలొస్తున్న సంగతి తెలిసిందే.
సినిమా ఇంకా ఓకే కాలేదు. కానీ విక్రమ్ కుమార్ రామ్ చరణ్ ని కలిసిన మాట నిజమే. ఆయన ఓ లైన్ చెప్పాడు. అది చరణ్ కి నచ్చింది. కాకపోతే పూర్తి స్క్రిప్ట్ విన్నాక.. నచ్చితేనే ఓకే చెబుతానని చెప్పాడట చరణ్. ఈ నేపథ్యంలో చరణ్ కోసం పూర్తి స్క్రిప్ట్ ని రెడీ చేసే పనిలో విక్రమ్ ఉన్నాడు. ప్రస్తుతం రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ సినిమాతో బిజీగా ఉన్నారు.
ఈ సినిమా తర్వాత చరణ్ కోసం కొరటాల శివ సిద్ధంగా ఉన్నాడు. చరణ్ కూడా ఆర్ ఆర్ ఆర్ తర్వాత కొరటాల కోసం కాల్షీట్లు కేటాయిస్తానని ఇటీవలే ఓ సందర్భంలో చెప్పారు. ఈ నేపథ్యంలో చరణ్ విక్రమ్ కుమార్ కథని ఓకే చేసినా.. ఇప్పట్లో సినిమా ఉండే అవకాశాలు కనిపించడం లేదు. పైగా ప్లాప్ ల్లో ఉన్న విక్రమ్ తో చరణ్ సినిమా చేయడం మెగా అభిమానులకి ఇష్టం లేదు. హిట్-ప్లాపులు సహజం విక్రమ్ ప్రతిభని నమ్మి విక్రమ్ తో చరణ్ సినిమా చేస్తాడా ? అదెప్పుడు ?? అన్నది వేచి చూడాల్సిందే. మార్ ఒప్పించవలసి వుంది. మరి కొరటాల – విక్రమ్ కుమార్ లలో ఎవరితో ముందుగా చరణ్ సెట్స్ పైకి వెళతాడో చూడాలి.