‘విజిల్’ కత్తిరింపులు.. ఎందుకంటే ?

విజయ్-అట్లీ కలయికలో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం ‘బిగిల్’. తెలుగులో ‘విజిల్’గా తీసుకొచ్చారు. దీపావళి కానుకగా గతవారం (అక్టోబర్ 25) ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘బిగిల్’ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకొంది. అందుకు తగ్గట్టుగానే కలెక్షన్స్ ఉన్నాయి. ఇప్పటికే రూ. 200కోట్ల క్లబ్ లో చేరిపోయినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఐతే, ఈ సినిమాలోని ఓ సన్నివేశం వివాదాస్పదం అయింది.

సినిమాలో ఓ అమ్మాయి ఆకారాన్ని హేళన చేసేలా విజయ్ మాట్లాడే సన్నివేశం ఉంది. నిజానికి జట్టులోని సభ్యుల్లో చైతన్యం నింపి తద్వారా విజయాన్ని అందుకోవడం కోసం కథానాయకుడి వ్యూహమది. అయితే సామాజిక మాధ్యమాల్లో విజయ్ మాటలపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో సదరు సన్నివేశాలను తొలగించారు. అంతేకాకుండా మరికొన్ని సన్నివేశాలని కత్తిరించారు.

బిగిల్ నిడివి సరిగ్గా మూడు గంటలు ఉంది. సినిమా నిడివి, ఇంటర్వెల్ , పార్కింగ్  ఇలా అన్ని విషయాలను కలిపితే ఏకంగా 4 గంటలపైనే సమయం పడుతోందని పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు. ఇది కూడా సినిమాకు కాస్త నెగిటివ్ టాక్ గా మారింది. దీంతో చిత్రంలో మరికొన్ని సన్నివేశాలను కూడా తొలగించారు. మరింత షార్ప్ గా మారిన ‘విజిల్’ మైలేజ్ పెరగనుందని చెబుతున్నారు.