అల.. 100మిలియన్ వ్యూస్ !

అల.. పాటలు సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కుతోన్న హ్యాట్రిక్ చిత్రం ‘అల.. వైకుంఠపురంలో’. ఈ సినిమా నుంచి వచ్చిన తొలి పాట ‘సామజవరగమన’ డిజిటల్ రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. అత్యధిక వ్యూస్, లైక్స్ సొంతం చేసుకొన్న తొలి తెలుగు పాటగా సరికొత్త రికార్డులు సృష్టించింది. 

ఇక అల.. నుంచి వచ్చిన మాస్ సాంగ్ ‘రాములో రాముల’కు రెస్పాన్స్ అదిరిపోయింది. ఇప్పుడీ ఈ రెండు పాటలు కలిసి యూట్యూబ్ లో సరికొత్త రికార్డ్ సృష్టించాయ్. 100మిలియన్ వ్యూస్ కి పైగా సొంతం చేసుకొన్నాయి. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్రబృందం.. ఓ పోస్టర్ ని విడుదల చేసింది. ఇప్పుడీ పోస్టర్, న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయిక. బాలీవుడ్ నటి టబు కీలక పాత్రలో నటిస్తున్నారు. యంగ్ హీరోలు నవదీప్, సుశాంత్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం. హారిక & హాసినీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే రోజున మహేష్ సరిలేరు నీకెవ్వరు కూడా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ రెండు చిత్రబృందాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. రెండ్రోజుల గ్యాప్ లో ఈ రెండు సినిమాలని రిలీజ్ చేసేందుకు చర్చలు జరుగుతున్నట్టు టాక్. అదే జరిగితే.. అల.. రిలీజ్ డేటు మారవచ్చు.