విశాల్ ‘యాక్షన్’ (తెలుగు) ట్రైలర్ చూశారా ? 

తమిళ్ స్టార్ విశాల్ చాన్నాళ్ల తర్వాత ఫుల్ లెన్త్ యాక్షన్ లోకి దిగారు. సెల్యూట్ తర్వాత ఆయన చేస్తున్న పూర్తిస్థాయి యాక్షన్ చిత్రం ‘యాక్షన్’. తమన్నా కథానాయిక. సి. సుందర్ దర్శకుడు.  ఐశ్వర్య లక్ష్మి, యోగిబాబు, ఆకాంక్ష పూరి, కబీర్ దుహాన్ సింగ్ తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ నెలలోనే ‘యాక్షన్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 
తాజాగా ‘యాక్షన్’ తెలుగు ట్రైలర్ ని విడుదల చేశారు. ట్రైలర్ లో యాక్షన్ అదిరిపోయింది. విశాల్ తో పాటు మిల్కీ బ్యూటీ తమన్నా యాక్షన్ లోకి దిగింది. దాంతో పాటు గ్లామర్ ని ఒలకబోసింది. సినిమాలో విశాల్, తమన్నా అండర్ కవర్ కాప్స్ గా కనిపించనున్నారని తెలుస్తోంది. యాక్షన్ ట్రైలర్ అదిరింది. తమన్నా, విశాల్ ల యాక్షన్ ట్రైలర్ ని మీరు చూసేయండీ.. !