ఉపాసన ట్విట్ ఎఫెక్ట్ : చిరు, చరణ్’లకి ప్రధాని పిలుపు

మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు త్వరలోనే ప్రధాని నరేంద్ర మోడీని కలవబోతున్నారు. వీరిద్దరికి ప్రధాని నుంచి ఆహ్వానం వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా రామ్ చరణ్ నే వెల్లడించారు. ఇటీవల ఓ ఆంగ్ల పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చరణ్ ఈ విషయం గురించి తెలిపారు. అంతేకాదు.. మోడీని కలవడం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాం అన్నారు. ఎన్నికల హడావుడి ముగిసిన తర్వాత ఢిల్లీ వెళ్లి ప్రధాని కలవనున్నాం అని చెప్పారు.

ఇటీవల బాలీవుడ్ సినీ ప్రముఖులకి ప్రధాని నరేంద్ర మోడీ ఆతిథ్యం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సమావేశానికి దక్షిణాది నటీనటులని ఆహ్వానించకపోవడంపై మెగా కోడలు ఉపాసన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ట్విట్ చేసిన సంగతి తెలిసిందే. అది కాస్త వైరల్ అయింది. ఉపాసన ట్విట్ ఎఫెక్ట్ తోనే ప్రధాని నుంచి చిరు, చరణ్ లకి ఆహ్వానం లభించినట్టు తెలుస్తోంది. మరోవైపు, సైరా రిలీజ్ తర్వాత ఢిల్లీ వెళ్లిన మెగాస్టార్ చిరంజీవి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో సహా పలువురి కలిశారు.

ఆ సమయంలో చిరు ప్రధాని మోడీని కూడా కలవాలని భావించారు. కానీ, ఆయనకి ప్రధాని అపాయింట్ మెంట్ దొరకలేదు. ఈ విషయం తెలుసుకొన్న ప్రధాని మోడీ చిరు, చరణ్ లకి స్పెషల్ ఆహ్వానం పంపారట. త్వరలోనే చిరు, చరణ్ ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీని కలవనున్నారు. వీరి మధ్య సైరా ముచ్చట్లు, రాజకీయ చర్చలు జరగనున్నట్టు సమాచారమ్.