బిగ్ బాస్ స్టేజ్ పై హాట్ హీరోయిన్స్ చిందులు !


బిగ్ బాస్ 3 ఈ వారంతో ముగియనున్న సంగతి తెలిసిందే. ఫైనల్ ఏపీసోడ్ ని గ్రాండ్ గా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ వేడుకకి మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా హాజరుకానున్నారని తెలుస్తోంది. అంతేకాదు.. బిగ్ బాస్ 3 ముగింపు వేడుకల్లో ఒకరిద్దరు హాట్ హీరోయిన్స్ చిందేయనున్నట్టు సమాచారమ్. ఈ లిస్టులో నిధి అగర్వాల్, క్యాథరిన్ థెరిస్సా పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయ్. అంజలిని కూడా అడిగారట. ఆమె కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. అదే జరిగితే.. బిగ్ బాస్ ముగింపు వేడుకల్లో రెండు, మూడు ఐటమ్ సాంగ్స్ చూసేయొచ్చు అన్నమాట. 

ఇక బిగ్ బాస్ 3 విజేతగా ఎవరు నిలుస్తారు ? అన్నది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం బిగ్ బాస్ ఇంట్లో ఐదుగురు ఉన్నారు. రాహుల్, శ్రీముఖీ, వరుణ్ సందేష్, బాబా భాస్కర్ బిగ్ బాస్ 3 టైటిల్ కోసం తలపడుతున్నారు. వీరిలో శ్రీముఖి, రాహుల్ ల మధ్య గట్టిపోటీ ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకైతే.. ఓటింగ్ లో రాహుల్ ముందున్నాడని సమాచారమ్. మరోవైపు, శ్రీముఖి కోసం పెద్ద ఎత్తున క్యాంపైనింగ్ జరుగుతోంది. హాట్ యాంకర్ రష్మి తదితరులు శ్రీముఖికి సపోర్ట్ చేయమంటూ స్పెషల్ వీడియోలు విడుదల చేస్తున్నారు. మరీ.. ఆ ఎఫెక్ట్ తో శ్రీముఖి రాహుల్ ని బీట్ చేస్తుందేమో చూడాలి.